‘కరోనా’ తో బ్రిటిష్ కమెడియన్ బ్రూక్ టేలర్ మృతి

13-04-2020 Mon 16:11
  • కామెడీ కింగ్ టిమ్ బ్రూక్  టేలర్ (75) మృతి
  • 1970లలో ని ‘ది గుడీస్’ బీబీసీ కామెడీ షో తో ఆయన ప్రసిద్ధి
  • బ్రూకీ టేలర్ మృతిపై  రచయిత సిమన్ బ్లాక్ వెల్ దిగ్భ్రాంతి
Britain commedian Brooke Taylor died of corona

‘కరోనా’ బారిన పడ్డ బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్  టేలర్ (75) నిన్న మృతి చెందారు. ఈ వైరస్ బారి నుంచి క్రమంగా కోలుకుంటున్న తరుణంలో ఆయన మృతి చెందారు. కాగా, 1970లలో వచ్చిన ‘ది గుడీస్’ బీబీసీ కామెడీ షో లో ఆయన పండించిన హాస్యం పలువురిని కడుపుబ్బ నవ్వించింది. బ్రూకీ టేలర్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన మృతిపై ప్రముఖ రచయిత సిమన్ బ్లాక్ వెల్ తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టేలర్ తన హాస్యంతో వివిధ తరాలకు చెందిన ప్రజలను నవ్వించారని కొనియాడారు.