సల్మాన్ తో చేయడమంటే ఆనందంగానే కాదు భయంగాను వుంది: పూజ హెగ్డే

13-04-2020 Mon 15:33
  • సల్మాన్ గొప్ప నటుడు
  • ఆయన జోడీ కట్టడమే అదృష్టం
  • అందుకోసమే వెయిట్ చేస్తున్నానన్న పూజ హెగ్డే
Kabhi Eid kabhi Diwali
మొదటి నుంచి కూడా పూజ హెగ్డే దృష్టి బాలీవుడ్ పైనే వుంది. ఒక వైపున తెలుగులో ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున బాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. అదృష్టం కలిసొచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అడపా దడపా హిందీలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సరసన అవకాశాన్ని దక్కించుకుంది. ఆయన జోడీగా 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా ఆమె మాట్లాడుతూ .. "సల్మాన్ గొప్ప నటుడు .. ఆయన సరసన నటించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఆయన సొంతం. ఆయన సీనియారిటీ .. క్రేజ్ నన్ను కాస్త భయపెడుతున్నాయి. ఇక ఆయన జోడీగా ఛాన్స్ దక్కడం ఆనందంగాను వుంది. నటన పరంగా ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.