Eatala: దయచేసి మీ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించండి: ఈటల విజ్ఞప్తి

TS Health minister Eatala says any person who requires vaccination service please go on
  • కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్
  • పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించాలని ఈటల సూచన
  • వచ్చే వారం నుంచి శనివారం కూడా వ్యాక్సిన్లు వేస్తారని వెల్లడి
కరోనా లాక్ డౌన్ కారణంగా సకలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలనుకుంటే, దయచేసి ప్రతి బుధవారం తమకు సమీపంలోని ప్రజా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. వారు తమ వెంట తల్లికి చెందిన ఎంసీహెచ్ కార్డు లేక ఇమ్యూనైజేషన్ కార్డు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వచ్చే వారం నుంచి శనివారం నాడు కూడా వ్యాక్సిన్ లు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Eatala
Vaccine
PHC
Corona Virus
Telangana

More Telugu News