మాస్క్ స్వయంగా తయారు చేసి చూపించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

13-04-2020 Mon 14:55
  • ‘కరోనా’ కట్టడికి మాస్క్ ధరించడం చాలా అవసరం
  • ఈ మాస్క్ ను సులభంగా ఎవరైనా తయారు చేయవచ్చు  
  • నేను తయారు చేశాను.. మీరు తయారు చేసి ధరించండి
Central Minister Prakash Javadeker mask preparation video

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రతి వ్యక్తి మాస్క్ ధరించడం చాలా అవసరమని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. మాస్క్ ను ఇళ్లల్లోనే చాలా సులభంగా రెండే నిమిషాల్లో ప్రతి ఒక్కరూ తయారుచేసుకోవచ్చని చెప్పారు.  ‘నేను తయారు చేశాను. అలాగే మీరు కూడా మాస్క్ సులభంగా తయారు చేసుకొని ధరించండి’ అంటూ ఓ వీడియో ద్వారా ప్రజలకు సూచించారు.