Virender Sehwag: నా బ్యాటింగ్ కు రామాయణంలోని ఈ పాత్రే స్ఫూర్తి: సెహ్వాగ్

  • అంగదుడే నా బ్యాటింగ్ కు స్ఫూర్తి
  • అతని కాలును కదపడం అసంభవమన్న సెహ్వాగ్
  • రామాయణ్ సీరియల్ లోని ఫొటోను షేర్ చేసిన డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
Virender Sehwag Names Ramayan Character That Gave Him Batting Inspiration

టీమిండియాలో విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఎవరని ప్రశ్నిస్తే... ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్థి ఎవరైనా, దేశం ఏదైనా, ఎలాంటి పిచ్ అయినా... బౌలర్ కు చుక్కలు చూపించడం మాత్రమే సెహ్వాగ్ కు తెలుసు. బంతిని ఎడాపెడా బాదుతూ... భారత్ విజయానికి బాటలు వేయడంలో సెహ్వాగ్ ది ప్రత్యేకమైన శైలి. అలాంటి సెహ్వాగ్ తన బ్యాటింగ్ కు సంబంధించి ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తిని పొందాడట. ఆయన మరెవరో కాదు రామాయణంలో వాలి కుమారుడైన అంగదుడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సెహ్వాగ్ తెలిపాడు.

దూరదర్శన్ లో ప్రసారమవుతున్న రామాయణ్ సీరియల్ లో ఓ సన్నివేశాన్ని కూడా సెహ్వాగ్ షేర్ చేశాడు. రావణుడి ఆస్థానంలో నిలబడ్డ అంగదుడి ఫొటో అది. అంగదుడి కాలును కదిపేందుకు రావణ సైన్యంలోని పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్న ఫొటో అది. దీనికి సంబంధించి కామెంట్ చేస్తూ... 'అతని కాలును కదపడమనేది కష్టమైనదే కాదు... అసంభవం కూడా' అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

More Telugu News