రేపు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

13-04-2020 Mon 14:33
  • ఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌన్  
  • రేపు ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్న మోదీ
  • ఈ విషయాన్ని తెలియజేసిన పీఎంఓ
Prime Minister Narendramodi will address the nation tomorrow

రేపటితో లాక్ డౌన్  ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతి నుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మోదీ ప్రసంగం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు జాతి నుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాయలం (పీఎంఓ) ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. కాగా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.