దమ్ బిర్యానీ తయారు చేసిన పురందేశ్వరి దంపతులు.. వీడియో ఇదిగో!

13-04-2020 Mon 14:20
  • లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
  • ఇంట్లో సందడి చేస్తున్న దగ్గుపాటి దంపతులు
  • కిచెన్ లో భార్యతో కలసి గరిటె తిప్పుతున్న వెంకటేశ్వరరావు
Daggubati Purandeshwari prepares Biryani with husband

కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో సామాన్యుడి దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. బిజీ షెడ్యూల్ నుంచి బయటకు వచ్చి... కుటుంబసభ్యులతో కలసి హ్యాపీగా సమయాన్ని గడుపుతున్నారు.

బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కూడా తన కుటుంబంతో కలసి సందడి చేస్తున్నారు. కిచెన్ లోకి వెళ్లి ఇంటిల్లిపాదికి రుచికరమైన వంటలు తయారు చేసి పెడుతున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కిచెన్ లో హంగామా చేయడం. ఇద్దరూ కలిసి నోరూరించే దమ్ బిర్యానీని తయారు చేశారు. వీడియో చూడండి.