నాకు తెలిసినదల్లా నటన మాత్రమే: నటి మీనా కుమారి

13-04-2020 Mon 14:04
  • ఏవీఎంలో ఎక్కువ సీరియల్స్ చేశాను
  • మా వారి ప్రోత్సాహం కారణం
  • క్రమశిక్షణతో ఉంటానన్న మీనా కుమారి
Meena Kumari about her career

బుల్లితెరపై అందమైన నటిగా మీనాకుమారి పేరు తెచ్చుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమె పలు ధారావాహికల్లో నటించింది. సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్న ఆమె, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నటిగా ఇంతకాలం పాటు కొనసాగే అవకాశం రావడం అదృష్టం. ఏవిఎం వంటి పెద్ద బ్యానర్లో భారీ ధారావాహికలు వరుసగా చేయడం విశేషంగా భావిస్తాను.

ఇంతకాలం పాటు నేను నటిస్తూ రావడానికి కారణం మా వారే. ఆయన ప్రోత్సాహం వలన .. అండగా నిలబడటం వలన నాకు ఈ స్థానం లభించింది. నేను నటన పైనే పూర్తి దృష్టి పెడతాను. పారితోషికంతో సహా మిగతా విషయాలేవీ నేను పట్టించుకోను. నాకు తెలిసింది నటన మాత్రమే కనుక, ఆ పనిని పెర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ క్రమశిక్షణే ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టిందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.