పవన్ సినిమాలపై స్పందించిన నాగబాబు

13-04-2020 Mon 13:05
  • 'వకీల్ సాబ్'లో పవన్ కొత్తగా కనిపిస్తాడు
  • క్రిష్ సినిమాలో పవర్ఫుల్ రోల్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్నాయన్న నాగబాబు
Vakeel Saab Movie

పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు వున్నాయి. వేణు శ్రీరామ్ .. క్రిష్ ..  హరీశ్ శంకర్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూడింటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని 'వకీల్ సాబ్' చాలావరకూ షూటింగు జరుపుకుంది. క్రిష్ దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కవలసి వుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలను గురించి నాగబాబు ప్రస్తావించారు.

'వకీల్ సాబ్' సినిమా గురించి పవన్ నాతో మాట్లాడాడు. హిందీ రీమేక్ అయినప్పటికీ, తెలుగు వెర్షన్లో మార్పులు చేశారట. తను ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాననీ, ఇది తనకి కరెక్ట్ గా సరిపోయిన పాత్ర అని తనతో పవన్ చెప్పాడని అన్నారు. ఇక క్రిష్ సినిమా కథా నేపథ్యం గురించి కూడా రకరకాలుగా రాస్తున్నారు. మొగలాయిల కాలంలో 'కోహినూర్' వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చాలా పవర్ఫుల్ పాత్రలో పవన్ కనిపిస్తాడని చెప్పారు. పవన్ చేస్తున్న ఈ రెండు సినిమాలు ప్రత్యేకమైనవి కావడం ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పారు.