తెలంగాణలో కలకలం.. నిజాముద్దీన్ తరహా మరో ఘటన వెలుగులోకి!

13-04-2020 Mon 12:59
  • యూపీలోని మదర్సా సమ్మేళనానికి వెళ్లిన పలువురు
  • ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు నమోదు
  • మిగిలిన వారిని గాలిస్తున్న పోలీసులు
Another Nizamuddin type of activity in Telangana

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టుండి రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ ఘటనను మరువక ముందే తెలంగాణను మరో ఘటన కుదిపేస్తోంది. నిజాముద్దీన్ తరహాలోనే మరో ఉదంతం వెలుగు చూడటంతో అధికారులు హడలిపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ లో ఇటీవల జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, పోలీసు శాఖ అప్రమత్తమైంది. అక్కడకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు, వారిని గాలించే పనిలో పడింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు 100 మంది వరకు హాజరైనట్టు భావిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కొందరిని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.