USA: కరోనా విలయతాండవం.. అమెరికాలో గంటకు ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

Every hour 83 patients dying in USA due to Corona virus
  • అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారు 22 వేల మంది
  • ప్రతి గంటకు 83 మంది దుర్మరణం
  • చికిత్స పొందుతున్న 25 లక్షల మంది
కరోనా రక్కసి అమెరికాలో మరణమృదంగం మోగిస్తోంది. కరోనా కేసులు సహా మృతుల సంఖ్యలో కూడా అగ్రరాజ్యం తొలి స్థానంలో ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న రాత్రి సమయానికి అమెరికాలో దాదాపు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి గంటకు సుమారు 83 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికాలో మరో ఐదున్నర లక్షల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. 50 వేల మంది సైన్యాన్ని కరోనా కట్టడి విధులకు వినియోగిస్తున్నారు.
USA
Corona Virus
Death Toll

More Telugu News