ఐదు భాషల్లో 'కార్తికేయ 2'

13-04-2020 Mon 11:55
  • నిఖిల్ చేతిలో రెండు ప్రాజెక్టులు
  • ఐదు భాషల్లో నిఖిల్ డబ్బింగ్
  • 'కార్తికేయ 2'పై భారీ అంచనాలు
Karthikeya 2 Movie

'అర్జున్ సురవరం'తో హిట్ అందుకున్న నిఖిల్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 18 పేజిస్' కాగా, మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలపైనే ఆయన పూర్తి దృష్టిపెట్టాడు. 'ఇతర భాషల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఇతర భాషల్లో నటించాలనే ఆలోచన లేదు .. 'కార్తికేయ 2' సినిమాను మాత్రం ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను" అని అన్నాడు. మొత్తానికి 'కార్తికేయ 2' భారీ స్థాయిలోనే విడుదల కానుందన్న మాట.