Narendra Modi: 'మోదీ అంకుల్‌ బయటకు రావద్దన్నారు' అన్న చిన్నారి.. ఆ వీడియోను పోస్ట్ చేసిన యాంకర్‌ రష్మీ

narendramodi PMOIndia  MODI UNCLE NEEDS TO SEE THIS
  • లాక్‌డౌన్‌ పాటించాలని చెప్పిన ఓ చిన్నారి
  • మోదీ చెప్పారని వ్యాఖ్య
  • 'అవును బాబు బయటకు వెళ్లొద్దు' అంటూ రష్మీ ట్వీట్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ చెప్పిన విషయాన్ని ఓ చిన్నారి చాలా ముద్దుగా చెబుతూ అలరించాడు. ఇంట్లో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ గురించి ప్రస్తావించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ ఆమె ఈ విషయాన్ని తెలిపింది. 'మోదీ అంకుల్‌ ఇది చూడాల్సిన అవసరం ఉంది. అవును బాబు.. మనం ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దు. చాలా క్యూట్‌గా చెప్పాడు.. లాక్‌డౌన్‌ ఉందని మోదీ అంకుల్‌ చెప్పారని అన్నాడు' అని రష్మీ పేర్కొంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని చెబుతున్న రష్మీ... వీధుల్లో ఆకలితో అలమటిస్తోన్న కుక్కలకు ఆహారం అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూగ జీవులకు ఆహారం అందించాలని కొన్ని రోజులుగా ఆమె పోస్టులు చేస్తోంది. జబర్దస్త్‌ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. పలు సినిమాల్లోనూ నటించింది.
Narendra Modi
India
Corona Virus
Jabardasth
Rashmi Gautam

More Telugu News