సాయిపల్లవి చెంతకి 'మహా సముద్రం' కథ

13-04-2020 Mon 10:10
  • 'ఆర్ ఎక్స్ 100'తో పడిన హిట్
  • పట్టాలెక్కని తదుపరి ప్రాజెక్టు
  • గట్టిగానే ట్రై చేస్తున్న దర్శకుడు  
Mahasamudram Movie

సాధారణంగా హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమాలు చేయడానికి యువ హీరోలు పోటీపడుతుంటారు. కానీ 'ఆర్ ఎక్స్ 100'తో భారీ విజయాన్నిచ్చిన అజయ్ భూపతి విషయంలో మాత్రం అలా జరగలేదు. 'మహా సముద్రం' కథ పట్టుకుని ఆయన హీరోల చుట్టూ తిరుగుతూనే వున్నాడు. రవితేజ .. చైతూ ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదు.

ఇక శర్వానంద్ ముందుగా మొగ్గు చూపినా, 'జాను' ఫ్లాప్ తరువాత ఆలోచనలో పడ్డాడని సమాచారం. అయితే ఆయను ఒప్పించేందుకు అజయ్ భూపతి గట్టి ప్రయత్నాలు చేస్తూనే, సాయిపల్లవికి కూడా కథ వినిపించాడట. సాయిపల్లవి ఇంకా ఏ విషయం చెప్పవలసి ఉందని అంటున్నారు. ఇంతకుముందు శర్వానంద్ జోడీగా ఆమె 'పడి పడి లేచె మనసు' చేసింది. త్వరలో కిషోర్ తిరుమల దర్శకత్వంలోను ఈ జంట కలిసి నటించనుంది. మళ్లీ శర్వానంద్ సరసన అంటే సాయిపల్లవి ఒప్పుకుంటుందా? అనేది చూడాలి.