సమంత మూవీలో గెస్టుగా చైతూ

13-04-2020 Mon 09:14
  • గతంలో హిట్ కొట్టిన 'ఓ బేబీ'
  • మళ్లీ సమంతతో నందినీ రెడ్డి
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
Nandini Reddy Movie

తెలుగులో విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకురాలిగా నందినీ రెడ్డికి మంచి పేరు వుంది. ఆమె తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య కథానాయకుడిగా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ సినిమాలో కనిపించేది కథానాయకుడిగా కాదు .. అతిథి పాత్రలో అనేది తాజా సమాచారం.

'ఓ బేబీ' మాదిరిగానే సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి ఒక కథను సిద్ధం చేసిందట. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రను యంగ్ హీరోతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నందినీ రెడ్డి వ్యక్తం చేయగా, ఆ పాత్రకు చైతూను సమంత ఒప్పించిందని అంటున్నారు. గతంలో నందినీ రెడ్డి .. సమంత కాంబినేషన్లో వచ్చిన ' ఓ బేబీ' సినిమాలోను చైతూ మెరిసిన సంగతి తెలిసిందే.