Lockdown: హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు.. 27,198 మందిపై కేసుల నమోదు

  • పని ఉన్నా లేకున్నా రోడ్లపైకి జనం
  • లాక్‌డౌన్ నిబంధనలు గాలికి
  • ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో గరిష్ఠంగా రెండేళ్ల జైలు
Police filed cases against people who came on roads

హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘనులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ నగరాన్ని భయపెడుతున్నప్పటికీ జనం మాత్రం రోడ్లపైకి రావడం మానడం లేదు. లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 27,198 పెటీ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 785 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News