Moon: వరుసగా మూడు రోజుల పాటు చంద్రుడితో ఒకే వరుసలోకి రానున్న గురు, అంగారక, శని గ్రహాలు

  • ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఖగోళ వింత
  • రెండేళ్లకోసారి ఒకే వరుసలోకి వచ్చే మూడు గ్రహాలు
  • ఈసారి వాటితో పాటు ఒకే వరుసలోకి వస్తున్న చంద్రుడు
Rare event in space

మరి కొన్నిరోజుల్లో ఖగోళంలో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. చంద్రుడితో అంగారక, శని, గురు గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ అద్భుత దృశ్యం వరుసగా మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఆకాశంలో ఈ మూడు గ్రహాలు చంద్రుడితో కలిసి ఒకే వరుసలో దర్శనమిస్తాయని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయు కాలుష్యం తగ్గినందున ఈ వింతను టెలిస్కోప్, బైనాక్యులర్స్ వంటి పరికరాల సాయం లేకుండా నేరుగా, స్పష్టంగా చూడొచ్చని పేర్కొన్నారు. సాధారణంగా రెండేళ్లకోసారి ఏప్రిల్ మాసం మధ్యలో శని, గురు, అంగారక గ్రహాలు ఒకే వరుసలోకి వస్తుంటాయని, ఈసారి చంద్రుడు కూడా ఈ వరుసలోకి వస్తున్నాడని వివరించారు.

More Telugu News