Sania Mirza: సానియా పదేళ్ల దాంపత్యం... భర్తకు రెండు ఫొటోలతో విషెస్ చెప్పిన టెన్నిస్ క్వీన్

Sania wishes her husband Shoaib Malik ob their tenth wedding anniversary
  • 2012 ఏప్రిల్ 10న షోయబ్ తో సానియా పెళ్లి
  • హ్యాపీ యానివర్సరీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
  • ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ సరదా వ్యాఖ్యలు
భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్టు చేసింది. ఆదివారం ఆమె పెళ్లి రోజు కావడంతో 10 ఏళ్ల వైవాహిక జీవితం సందర్భంగా భర్త షోయబ్ మాలిక్ కు హ్యాపీ యానివర్సరీ అంటూ విషెస్ తెలిపింది. అంతేకాదు, ఇరువురికి సంబంధించిన రెండు ఫొటోలను పోస్టు చేసింది. ఆ రెండు ఫొటోల మధ్య పోలిక తెస్తూ, "పదేళ్ల దాంపత్య జీవితం ఇలా ఉంటుంది... 'అంచనాలు-వాస్తవికత' (ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ)" అంటూ క్యాప్షన్ పెట్టింది. వాటిలో తొలి ఫొటోను ఉద్దేశించి అంచనాలు ఇలా ఉంటాయని, రెండో ఫొటోలో వాస్తవికత ఇలా ఉంటుందని వివరించింది. మొదటి ఫొటోలో షోయబ్, సానియా ఎంతో హుందాగా కనిపిస్తుండగా, రెండో ఫొటోలో కొంటెగా దర్శనమిచ్చారు.

మొత్తానికి ఈ ఫొటోలతో సానియా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. టెన్నిస్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన సానియా.... ఓ పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లాడుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. వీరి మధ్య ప్రేమ చిగురించడమే కాదు, అది పెళ్లి వరకు వెళ్లింది. వీరు తమ ప్రేమ విషయం ఎంతో గోప్యంగా ఉంచడమే కాదు, పెళ్లితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సానియా, షోయబ్ ల పెళ్లి 2010 ఏప్రిల్ 12న జరిగింది. ఈ క్రీడా జోడీకి ఇజాన్ మీర్జా మాలిక్ అనే తనయుడు ఉన్నాడు.
Sania Mirza
Shoaib Malik
Wedding Anniversary
Instagram
Tennis
Cricket
India
Pakistan

More Telugu News