Ram Vilas Paswan: సెలూన్ల మూసివేత... కొడుకుతో ట్రిమ్మింగ్ చేయించుకున్న కేంద్రమంత్రి... వీడియో వైరల్

Union Minister Ram Vilas Paswan gets saloon service by his son Chirag
  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రామ్ విలాస్ పాశ్వాన్
  • తండ్రికి ఓపిగ్గా ట్రిమ్మింగ్ చేసిన తనయుడు చిరాగ్
  • ఈ నైపుణ్యం ఉందని ఇప్పటివరకు తెలియదంటూ ట్వీట్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సకలం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సామాన్యుడికైనా, ప్రముఖుడికైనా ఇందులో మార్పేమీ లేదు. లాక్ డౌన్ కారణంగా కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సైతం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, సెలూన్లు మూసివేయడంతో ఆయన తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తో హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చిరాగ్ పాశ్వాన్ ట్రిమ్మర్ సాయంతో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ గడ్డాన్ని ఎంతో నేర్పుగా ట్రిమ్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. తనయుడు ట్రిమ్మింగ్ చేస్తున్నంత సేపు ఓపిగ్గా కూర్చున్న కేంద్రమంత్రివర్యులు ఆపై అద్దంలో తనను తాను చూసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియోను చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. తనలో ఈ నైపుణ్యం కూడా ఉందని ఇప్పటివరకు తెలియదన్న చిరాగ్, లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త కోణాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
Ram Vilas Paswan
Chirag Paswan
Trimming
Saloon
Corona Virus
Lockdown

More Telugu News