Corona Virus: దేశవ్యాప్తంగా 295కి చేరిన కరోనా మరణాలు... రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న కేసులు

Death toll raises in country
  • దేశవ్యాప్తంగా 8,731కి పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • 845 మంది కోలుకున్నారన్న కేంద్రం
  • లక్షా 87 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
భారత్ లో కొన్నివారాల కిందట ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. పాజిటివ్ కేసుల సంఖ్య 8,731కి పెరగ్గా, కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 295కి చేరింది. ఇప్పటివరకు 845 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్రం ప్రకటించింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

 ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మృతుల వివరాలు చూస్తే....

  • తెలంగాణాలో 503 పాజిటివ్ కేసులు, 14 మరణాలు
  • ఏపీలో 407 పాజిటివ్ కేసులు, 6 మరణాలు
  • మహారాష్ట్రలో 1895 కేసులు, 129 మరణాలు
  • ఢిల్లీలో 1069 కేసులు, 19 మరణాలు
  • తమిళనాడులో 969 కేసులు, 11 మరణాలు
  • రాజస్థాన్ లో 796 కేసులు, 8 మంది మృతి
  • మధ్యప్రదేశ్ లో 532 పాజిటివ్ కేసులు, 42 మరణాలు
  • గుజరాత్ లో 493 కేసులు, 23 మంది మృతి
  • ఉత్తరప్రదేశ్ లో 452 కేసులు, ఐదుగురి మృతి
  • కేరళలో 373 కేసులు, ఇద్దరి మృతి
  • జమ్మూకశ్మీర్ లో 224 కేసులు, 4 మరణాలు
  • కర్ణాటకలో 226 కేసులు, 6 మరణాలు
  • హర్యానాలో 179 కేసులు, ఇద్దరి మృతి
  • పంజాబ్ లో 158 కేసులు, 12 మంది మృతి
  • పశ్చిమబెంగాల్ లో 132 కేసులు, ఐదుగురి మృతి
  • బీహార్ లో 64 పాజిటివ్ కేసులు, ఒకరి మృతి
  • ఒడిశాలో 54 కేసులు, ఒక మరణం



Corona Virus
India
Deaths
Positive Cases
COVID-19

More Telugu News