KTR: ఈ వారంలో నాకు నచ్చిన ‘పిక్’ ఇదీ!: మంత్రి కేటీఆర్

Minister Ktr posted an intersing photo of tiny tots who maintain social distance
  • సామాజిక దూరం పాటిస్తూ ఓ దుకాణం ముందు నిలబడ్డ  చిన్నారులు 
  • ‘సోషల్ డిస్టెన్స్’ పాటించే కళను పెద్దలకు బోధిస్తున్న చిన్నారులు 
  • ఆ చిన్నారులపై ప్రశంసలు కురిపిస్తూ కేటీఆర్ ట్వీట్
‘కరోనా’ కట్టడికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఒకటి సామాజిక దూరం పాటించడం. ఈ విషయాన్ని ప్రభుత్వం, వైద్య శాఖ సహా  పలు శాఖల అధికారులు ప్రజలకు తరచుగా చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ నిబంధనను పెడచెవిన పెట్టిన పెద్దలూ లేకపోలేదు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర  ఫొటోను పోస్ట్ చేశారు.

‘ఈ వారంలో నాకు నచ్చిన చిత్రం’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలో సామాజిక దూరం పాటిస్తూ ఓ దుకాణం ముందు చిన్నారులు నిలబడి ఉండటం కనబడుతుంది. ఓ చిన్నారి ఆ దుకాణంలో ఏదో కొనుగోలు చేస్తుండగా, మిగిలిన నలుగురు సామాజిక దూరం పాటిస్తూ బయట నిలబడి ఉండటం గమనించవచ్చు. ‘సోషల్ డిస్టెన్స్’ పాటించడం అనే కళను పెద్దలకు చిన్నారులు బోధిస్తున్నారంటూ వారిపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
KTR
TRS
Telangana
Corona Virus
Social Distancing

More Telugu News