Jagan: సీనియర్ న్యూస్ రీడర్ పార్వతీ ప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ విచారం

AP CM Jahan expresses grief over demise of senior news reader Parvathy Prasad
  • అనారోగ్యంతో కన్నుమూసిన పార్వతీ ప్రసాద్
  • ఆలిండియా రేడియో, దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా గుర్తింపు
  • సంతాపం తెలియజేసిన ఏపీ సీఎం
వార్తలు చదవడంలో తనకంటూ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్ కన్నుమూశారు. పార్వతీ ప్రసాద్ మరణం పట్ల ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. పార్వతీ ప్రసాద్ కు భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. 80వ దశకం నుంచే ఆమె ఆలిండియా రేడియో, దూరదర్శన్ వంటి ప్రభుత్వ మాధ్యమాల్లో ప్రముఖ న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఆమె భారత్ లో తొలితరం న్యూస్ రీడర్.
Jagan
Parvathy Prasad
All India Radio
Doordarshan
News Reader
India

More Telugu News