USA: యూఎస్ చరిత్రలో తొలిసారిగా జాతీయ విపత్తు: కీలక ప్రకటన చేసిన ట్రంప్

  • దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ మహమ్మారి వైరస్
  • ఇకపై వైట్ హౌస్ నుంచే నేరుగా నిధులు
  • యూఎస్ లో 5.33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
First Time in USA History National Desaster Announced

అమెరికన్లను కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తూ, మృతుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్న వేళ, కరోనాను జాతీయ విపత్తుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇలా జాతీయ విపత్తును గుర్తించడం ఇదే తొలిసారి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మహా విపత్తు నెలకొని వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ఫెడరల్ ప్రభుత్వ నిధులను రాష్ట్రాలు కరోనా నివారణకు, వ్యాప్తి నిరోధానికి వినియోగించుకోవచ్చని వెల్లడించిన ట్రంప్, వైట్ హౌస్ నుంచే నేరుగా రాష్ట్రాలకు నిధులందుతాయని, ఎమర్జెన్సీ సర్వీస్ లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

కాగా, అమెరికాలో మరణాల సంఖ్య రోజుకు దాదాపు 2 వేలకు చేరింది. మృతుల విషయంలో ముందున్న ఇటలీని కూడా అమెరికా అధిగమించింది. శనివారం నాడు 1,912 మంది మరణించారని, దీంతో మృతుల సంఖ్య 20,597కు చేరిందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రధానంగా న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి ప్రభావం చూపగా, ఇప్పుడు చికాగోతో పాటు మధ్య, పశ్చిమ ప్రాంతాలకూ విస్తరిస్తోందని వైట్ హౌస్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 5.33 లక్షల మందికి పైగా వైరస్ సోకిందని, వైరస్ బాధితులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కూడా మరణిస్తూ ఉండటం ఆందోళనను పెంచుతోందని పేర్కొంది. ఇక గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికాగోలోని కూక్ కౌంటీలో 2 వేల మృతదేహాలను భద్రపరిచేలా ఓ మార్చురీని ఏర్పాటు చేశారు. ఈస్టర్ సందర్భంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు వీధుల్లో ప్రకటనలు చేస్తూ, ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. 

  • Loading...

More Telugu News