Tirumala: తిరుమల వెంకన్న దర్శనం ఇప్పట్లో లేనట్టే!

  • ఇప్పటికే నిలిచిపోయిన భక్తుల దర్శనాలు
  • కరోనా అదుపులోకి రాకపోవడంతో పొడిగింపు
  • నెలాఖరు తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం
No Darshan for Piligrims in Tirumala

హిందువుల ఇలవేల్పు, ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనం మరిన్ని రోజుల పాటు భక్తులకు లభించబోదు. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న వేళ, తిరుమలలోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు నేడో, రేపో ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. గత నెలలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత, తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, ఆపై దాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. ఇప్పుడు లాక్ డౌన్ మరోమారు పొడిగించక తప్పదన్న అంచనాల నేపథ్యంలో, భక్తులకు దర్శనం రద్దు నిర్ణయాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం. నెలాఖరు వరకూ దర్శనాలు నిలిపివేసి, ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News