Prabhas: క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించే ప్రభాస్

Radhakrishna Kumar Movie
  • రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రభాస్ మూవీ
  • యాక్షన్ తో కూడిన ఎమోషన్ కి ప్రాధాన్యత
  • యూత్ ను ఆకట్టుకునే క్లైమాక్స్  
ప్రభాస్ తాజా చిత్రం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. పునర్జన్మలకి సంబంధించిన ప్రేమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యూవీ క్రియేషన్స్ వారు కృష్ణంరాజుతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరిగింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ మార్క్ యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట.

ముఖ్యంగా నాయకా నాయికల మధ్య చోటుచేసుకునే ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ నటన కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. ఇంతకుముందు ప్రభాస్ సినిమాల్లోను యాక్షన్ తో పాటు ఎమోషన్ వుంది. అయితే, అది ఈ సినిమాలో మరింత సున్నితంగా వుండి హృదయాలను తాకుతుందని అంటున్నారు. ప్రభాస్ - పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్ తో కూడిన క్లైమాక్స్ బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
Prabhas
Pooja Hegde

More Telugu News