'మాట నిలబెట్టుకున్నావ్' అంటూ తమన్ ను అభినందించిన అల్లు అర్జున్

11-04-2020 Sat 14:03
  • 'అల వైకుంఠపురములో' సినిమాకి తమన్ బాణీలు
  • మ్యూజికల్ హిట్  గా నిలబెట్టిన తమన్
  • గర్వంగా ఉందన్న అల్లు అర్జున్
Ala vaikunthapuramulo Movie

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయంలో తమన్ సంగీతం కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలోని పాటలు వ్యూస్ పరంగా యూ ట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టించాయి.

ఈ నేపథ్యంలో తమన్ ను ట్విట్టర్ ద్వారా బన్నీ అభినందించాడు. "ప్రియమైన తమన్ .. ఈ సినిమా ప్రారంభానికి ముందే, నాకు బిలియన్ ప్లే అవుట్స్ ఆల్బమ్ కావాలని నేను అడిగాను. వెంటనే నువ్వు ఓకే అనేశావ్. ఇప్పటికి 1.13 బిలియన్ మంది ఈ పాటలు విన్నారు. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్. నిజంగా నాకు చాలా గర్వంగా వుంది" అంటూ తమన్ పై ప్రశంసలు కురిపించాడు. 'ఈ ట్వీట్ ను జీవితాంతం దాచుకుంటాను' అంటూ తమన్ సమాధానమిస్తూ, బన్నీ పట్ల తనకి గల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.