chidamnaram: ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ కు ముందు.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిదంబరం సూచన

ask PM modi to cash pakage for poor says chidambaram
  • లాక్‌డౌన్‌తో నిరుపేదల జీవితాలు దుర్భరం
  • ముఖ్యంగా పేదల సమస్యలు ప్రస్తావించండి
  • వారి కోసం రూ.65 వేల కోట్లు కేటాయించమనండి
లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి కనీసం తినడానికి తిండికూడా లేని పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంలోని నిరుపేదల కోసం 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం సూచించారు.

 ఈరోజు సీఎంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిన నేపథ్యంలో అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ సీఎంలకు చిదంబరం ఈ సూచన చేశారు. ‘పేదలు  తాము పొదుపు చేసుకున్న కొద్దిమొత్తం కూడా ఖర్చుచేసేశారు. ఇప్పుడు తినడానికి తిండికూడా లేక దాతలు ఇచ్చే ప్యాకెట్ల కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలి. వారికి నగదు రూపంలో సాయం అందించాలి. వారి కోసం రూ.65 వేల కోట్లు కేటాయించాలని  ప్రధానిని కోరండి’ అని చిదంబరం దిశానిర్దేశం చేశారు.
chidamnaram
Narendra Modi
cashpackage
poor

More Telugu News