India: 1.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోనున్న భారత ఎగుమతుల రంగం!

  • ఎగుమతులపై ప్రభావం చూపనున్న మాంద్యం
  • 50 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం
  • భారీగా పెరగనున్న నిరర్థక ఆస్తులు
Indian exports sector to loose 15 million jobs

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోంది. కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచ దేశాలు జారుకుంటున్నాయి. దాదాపు ప్రతి రంగం దీని బారిన పడబోతోంది. భారత్ లో కూడా అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితం కాబోతున్నాయి.

ఎగుమతుల రంగం కూడా భారీ ఎత్తున సంక్షోభానికి గురి కాబోతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. మాంద్యం నేపథ్యంలో 50 శాతం వరకు ఆర్డర్లు క్యాన్సిల్ కావచ్చని  అంచనా వేసింది. దీని కారణంగా ఈ రంగంలో రూ. 1.50 కోట్ల ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  నిరర్ధక ఆస్తులు కూడా భారీగా పెరుగుతాయని అంచనా వేశారు.

కావాల్సినంత సిబ్బందితో ఫ్యాక్టరీలు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు... అవి నష్టాల్లోకి జారుకుంటాయని, ఆ తర్వాత మూత పడతాయని ఎక్స్ పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎగుమతుల రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరింది. ఎక్స్ పోర్ట్స్ సెక్టార్ ను ప్రభుత్వం వెెంటనే అనుమతించాలని... శానిటైజేషన్, సామాజిక దూరం వంటివి పాటిస్తూ కనీస సిబ్బంది పని చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది.

More Telugu News