Shriya Saran: నా భార్య నుంచి నన్ను కాపాడండి: శ్రియ భర్త ఆండ్రీ చమత్కారం

Shriya enjoying lockdown with her husband
  • రష్యాలో భర్తతో కలిసి ఉన్న శ్రియ
  • సెటైరికల్ సైన్ బోర్డులతో భార్యాభర్తల సందడి
  • సామాజిక దూరాన్ని పాటించాలన్న శ్రియ
లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో పనులు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని అభిమానులకు పిలుపునిస్తున్నారు. టాలీవుడ్ ను గతంలో ఒక ఊపు ఊపిన శ్రియ కూడా తన భర్తతో కలిసి ఇంట్లో గడుపుతోంది. అయితే, ఈ జంట ఇండియాలో లేరు. శ్రియ భర్త ఆండ్రీ దేశమైన రష్యాలో ఉన్నారు.

ఇప్పుడు శ్రియ, ఆండ్రీలు సెటైరికల్ సైన్ బోర్డులతో సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సామాజిక దూరం పాటించండి అని శ్రియ సైన్ బోర్డు చూపించింది. ఆమె నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుందనే బోర్టును ఆండ్రీ చూపించాడు. ఆ తర్వాత ...  విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శ్రియ బోర్డు చూపించగా...  తనతో రోజంతా పని చేయిస్తోందనే బోర్డును ఆమె భర్త చూపించాడు. అనంతరం... ఇంటి వద్దే ఉండండి అనే బోర్డును శ్రియ చూపించగా... ఆమె నుంచి నన్ను కాపాడండి అని ఆండ్రీ సైన్ బోర్డును చూపించాడు. ఈ విధంగా వీరిద్దరూ  అభిమానులను అలరించారు.
Shriya Saran
Andri
Husband
Lockdown
Tollywood

More Telugu News