సినిమా కబుర్లు.. సంక్షిప్త వార్తలు

11-04-2020 Sat 08:15
  • కిచెన్ లో కాజల్ ప్రయోగాలు
  • బి.గోపాల్ తో బాలయ్య ప్రాజక్టు లేదా?
  • కొత్త వాళ్లతో రానున్న శ్రీను వైట్ల

Kajal Agarwal experiments in kichen

*  లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం కావడంతో సినీ తారలు ఆ సమయాన్ని తాము ఎలా గడుపుతున్నదీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అందాలతార కాజల్ కూడా కిచెన్ లో దూరి ప్రయోగాలు చేస్తోందట. తాజాగా ఇంట్లో వాళ్లకి వేడి వేడి సమోసాలు చేసిపెట్టినట్టు చెబుతూ, ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.

*  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ దీని తర్వాత తన ప్రాజక్టును సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తో చేయనున్నట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజక్టు కేన్సిల్ అయిందట. కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

*  ఒకప్పుడు హిట్స్ మీద హిట్స్ ఇచ్చి టాప్ డైరెక్టర్ గా రాణించిన శ్రీను వైట్ల ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనుకపడిపోయాడు. ఆమధ్య చేసిన 'అమర్ అక్బర్ ఆంథోని' కూడా ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఓ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు, కొత్త వాళ్లతో ఈ చిత్రాన్ని చేయనున్నట్టు సమాచారం.