India: పాక్ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసిన ఇండియా... వీడియో విడుదల!

  • ఈ నెల తొలివారంలో ఐదుగురిని పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదులు
  • ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
  • సరిహద్దుల వెంబడి బోఫోర్స్ గన్ లతో దాడులు
India Targets Pakisthan Ammo Dump

జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఏ విధమైన కవ్వింపులూ లేకుండానే, కాల్పులు జరిపి, ఐదుగురు ప్రత్యేక దళ సైనికులను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. భారత సరిహద్దుల నుంచి బోఫోర్స్ గన్స్ ను వినియోగించిన సైన్యం, పాక్ కు చెందిన ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియోను సైన్యాధికారులు విడుదల చేశారు.

ఈ వీడియోలో పలుమార్లు పేలుడు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వున్న టెర్రర్ లాంచ్ పాడ్స్, పన్ పొజిషన్స్, ఆయుధాలను దాచివుంచిన కేంద్రాలపై దాడులు జరిపినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకున్న లక్ష్యాన్ని భారత గన్స్ ఛేదించాయని తెలిపాయి.

కాగా, గత ఆదివారం నాడు, కుప్వారా జిల్లాలో స్పెషల్ ఫోర్స్ సోల్జర్స్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు, ఐదుగురిని చంపేసిన సంగతి తెలిసిందే. ఆపై జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది.

 ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సైన్యం ఏప్రిల్ 1 నుంచి ఆపరేషన్ ప్రారంభించింది. ఆపై 5వ తేదీన సరిగ్గా ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలోకి జవాన్లు వెళ్లగా, వారంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పెక్టర్ సంజీవ్ కుమార్, హవల్దార్ దేవేంద్ర సింగ్, సిపాయిలు బాలక కిషన్, అమిత్ కుమార్, ఛత్రపాల్ సింగ్ మరణించారు. 

  • Loading...

More Telugu News