India: గడచిన ఇరవై నాలుగు గంటల్లో భారత్ లో నమోదైన ‘కరోనా’ కేసులు 896

central Health Ministry announces corona cases in India
  • ఒకే రోజులో పెద్ద మొత్తంలో కేసుల నమోదు
  • అలాగే మృతుల సంఖ్య కూడా
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

గడచిన ఇరవై నాలుగు గంటల్లో మన దేశంలో నమోదైన  ‘కరోనా’ కేసుల సంఖ్య 896 అని, 37 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘కరోనా’కు సంబంధించి రోజు వారీగా తెలియజేసే వివరాల్లో భాగంగా ఈ విషయాన్ని తెలిపింది. ఒక్క రోజులో కేసుల నమోదు సంఖ్యలో కానీ, మృతుల సంఖ్యలో కానీ ఇంత పెద్ద మొత్తం చోటుచేసుకోవడం ఇదే ప్రధమం. ఇక మన దేశంలో ఇప్పటి వరకూ మొత్తం  6761 కేసులు నమోదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

 

India
central health ministry
Corona Virus
cases 896

More Telugu News