Yanamala: హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ఈసీకి వర్తిస్తుంది: యనమల రామకృష్ణుడు

Yanamala Ramakrishnudu criticises AP Government
  • లేని అధికారాన్ని చెలాయించాలని చూడొద్దు
  • ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించాలని చూడడం హేయం
  •  పంచాయతీరాజ్ చట్ట సవరణలు రాజ్యాంగ పరిధిలోనే జరగాలి
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ఈసీకీ వర్తిస్తుందని అన్నారు. లేని అధికారాన్ని చెలాయించి, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించాలని చూడడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

పంచాయతీరాజ్ చట్ట సవరణలు రాజ్యాంగ పరిధిలోనే జరగాలని అన్నారు. కాగా, హైకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తి మాత్రమే ఎస్ఈసీగా నియామకానికి అర్హులుగా ఉంటారని, పదవీ కాలం మూడేళ్లకి కుదించినట్టు ఆర్డినెన్స్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ప్రస్తుత ఎస్ఈసీ పదవీకాలం ముగుస్తుంది.
Yanamala
Rama krishnudu
Telugudesam
SEC
Andhra Pradesh
GO

More Telugu News