సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళమిచ్చినందుకు ముఖేశ్ అంబానీకి ధన్యవాదాలు: మంత్రి కేటీఆర్

10-04-2020 Fri 19:17
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు ‘రిలయన్స్’ విరాళం రూ.5 కోట్లు
  • కేటీఆర్ కు చెక్కు అందజేసిన  ‘రిలయన్స్’ జియో తెలంగాణ సీఈఓ
  • ‘కరోనా’ మహమ్మారిపై పోరాటానికి ఈ మొత్తం ఎంతో ఉపయోగమన్న కేటీఆర్
Minister Ktr thanks to Reliance Mukesh Ambani

‘కరోనా’ కట్టడికి పోరాడుతున్న తెలంగాణ రాష్ట్రానికి  రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు. ‘రిలయన్స్’ జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి ఇందుకు సంబంధించిన విరాళం చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని కోరుతూ కేటీఆర్ కు అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేటీఆర్ ఓ పోస్ట్ చేశారు. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తాము చేస్తున్న పోరాటానికి ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.