ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ ఆమోదం

10-04-2020 Fri 18:18
  • కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం
  • ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ జీవో జారీ
  • ఈ జీవో ఆధారంగా ముగిసిన ఎస్ఈసీ రమేశ్ కుమార్ పదవీ కాలం
AP Governor has approved for ordinance

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. కొత్త ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కాగా, ఆర్డినెన్స్ ఆధారంగా ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ జీవో జారీ అయింది. ఈ జీవో ఆధారంగా ఎస్ఈసీ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసింది.