ఇంట్లో తీరిక సమయాల్లో నా భార్య మాస్కులు తయారు చేస్తోంది: కిషన్ రెడ్డి

10-04-2020 Fri 15:37
  • 'అందరికీ మాస్కులు' అంటూ ప్రధాని మోదీ పిలుపు
  • అవసరం ఉన్నవారికి మాస్కులు అందజేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడి
  • ప్రతి కుటుంబం ముందుకొచ్చి మాస్కుల తయారీ చేపట్టాలని విజ్ఞప్తి
Kishanreddy tells that his wife Kavya making masks at home

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన అర్ధాంగి కావ్య ఇంట్లో తీరిక సమయాల్లో కరోనా మాస్కులు తయారుచేస్తోందని తెలిపారు. అందరికీ మాస్కులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆమె మాస్కుల తయారీ చేపట్టిందని వివరించారు. తన భార్య తయారు చేస్తున్న మాస్కులను అవసరం ఉన్నవారికి అందిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి కుటుంబం ముందుకొచ్చి మాస్కుల తయారీలో పాలుపంచుకోవాలని సూచించారు. అంతేకాదు, తన భార్య కావ్య మాస్కులు తయారు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.