Vijay Sai Reddy: కన్నా గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో, పసుపు చొక్కా వేసుకున్న బాబు మనిషో అర్థమైపోయింది: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
  • బాబుకి నొప్పిలేస్తే ఈయన మందు పూసుకుంటున్నాడు
  • ఆయన ఊ... అనకముందే ఈయన రెచ్చి పోతున్నాడు 
  • జగన్ గారు మెడ్ టెక్ జోన్‌కు నిధులు కేటాయించారు
  • కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీ మొదలు పెట్టించారు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. 'కన్నా గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో, పసుపు చొక్కా వేసుకున్న బాబు మనిషో అర్థమై పోయింది ప్రజలందరికీ. ఆయనకు నొప్పిలేస్తే ఈయన మందు పూసుకుంటున్నాడు. ఆయన ఊ... అనకముందే ఈయన రెచ్చి పోతున్నాడు. కన్నా ఒక్కరిని కొనగలవేమో కానీ బీజేపీలో వ్యక్తిత్వం ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు విజనరీ' అని ట్వీట్ చేశారు.
  
'వైద్య పరికరాల తయారీ కోసం కేంద్రం మెడ్ టెక్ జోన్ ను కేటాయిస్తే లడ్డూ దొరికినట్లుగా దాని నిర్మాణ వ్యయాన్ని 400 కోట్ల రూపాయల నుంచి 2500 కోట్ల రూపాయలకు పెంచి లగడపాటికి అప్పగించి స్కాంకు పాల్పడ్డాడు బాబు. జగన్ గారు నిధులు కేటాయించి కోవిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీ మొదలు పెట్టించారు' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

కాగా, కరోనా నియంత్రణ కోసం పరీక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలో తయారు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కోవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేశారు. ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారు. 

  • Loading...

More Telugu News