Tollywood: మహేశ్​ సరసన సారా అలీఖాన్?

sara ali khan is going to act with mahesh babu in his next film
  • పరుశురాం దర్శకత్వంలో కొత్త సినిమా!
  • హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణ
  • బాలీవుడ్‌ యువతార పేరు ఖరారు!
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో  భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి పరుశరాం దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే  పూర్తయినట్టు సమాచారం. మహేశ్ కోసం ఎమోషనల్ గా సాగే కథతో కమర్షియల్ మూవీని పరుశురాం రెడీ చేశాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రం షూటింగ్‌ అక్టోబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది.  మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను చిత్ర బృందం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తొలుత కీర్తి సురేశ్, కైరా అద్వానీలో ఒకరిని హీరోయిన్‌గా ఎంచుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బాలీవుడ్ యువ తార సారా తెరపైకి వచ్చింది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tollywood
Mahesh Babu
sara ali khan
Bollywood

More Telugu News