Pavan Kalyan: 'వకీల్ సాబ్'పై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్

Vakeel Saab Movie
  • షూటింగు దశలో 'వకీల్ సాబ్'
  • కథానాయిక శ్రుతి హాసన్ అంటూ టాక్ 
  • అందులో నిజం లేదన్న శ్రుతి హాసన్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతోంది. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ తరువాత జరిగే షూటింగులో ఆమె జాయిన్ కానున్నట్టు ప్రచారం జరిగింది.

'గబ్బర్ సింగ్' తరువాత తెరపై ఈ జోడీని చూడటానికి పవన్ అభిమానులు ముచ్చటపడ్డారు. అయితే ఆ ఆశలపై శ్రుతి హాసన్ నీళ్లు చల్లేసింది. 'వకీల్ సాబ్' సినిమాలో నేను చేయడం లేదు. ఈ సినిమాలో నేను పవన్ కి భార్యగా నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. త్వరలో నేను షూటింగులో పాల్గొననున్నట్టు చెప్పుకుంటున్నారు .. అదంతా కేవలం పుకారు మాత్రమే" అని చెప్పుకొచ్చింది. శ్రుతి హాసన్ ఇలా స్పష్టం చేయడంతో, అభిమానుల దృష్టిలో కథానాయిక విషయం మళ్లీ మొదటికి వచ్చేసింది.
Pavan Kalyan
Sruthi Hassan
Venu Sriram

More Telugu News