టీజర్ తో రానున్న విజయ్ 'మాస్టర్'?

10-04-2020 Fri 10:42
  • విజయ్ తాజా చిత్రంగా 'మాస్టర్'
  • రెండు డిఫరెంట్ లుక్స్ తో సందడి 
  •  ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి
Master Movie

విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'మాస్టర్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ సరసన మాళవిక మోహన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఏదో విషయంపై విజయ్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. 'మాస్టర్'ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో 'మాస్టర్'ను మీరు చూస్తారు అనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ పై రాసుకొచ్చారు.

దీనిని బట్టి త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా విజయ్ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనుండటం విశేషం.