COVID-19: కరోనా సేవల కోసం మొబైల్‌ వీడియో యాప్‌ 'టిక్‌ టాక్‌' 25 కోట్ల డాలర్ల విరాళం

  • 15 కోట్ల డాలర్లు వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది కోసం
  • మిగిలిన మొత్తం వేర్వేరు విభాగాలకు
  • విపత్తు సమయంలో ఇది మా బాధ్యత : ప్రెసిడెంట్‌ అలెక్స్‌ జు
 TikTok Pledges 250 Million dollors For COVID19 Relief

కరోనా సహాయక చర్యల కోసం  ప్రముఖ మొబైల్‌ వీడియో యాప్‌ టిక్ టాక్ భారీ మొత్తం విరాళం ప్రకటించింది. ప్రపంచం విపత్తు ఎదుర్కొంటున్న నేపధ్యంలో నివారణకు ఆయా దేశాల ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల్లో తమవంతు భాగస్వామ్యం కోసం 25 కోట్ల డాలర్ల విరాళం అందజేస్తున్నట్లు టిక్‌టాక్‌ ప్రకటించింది.

ఇందులో 15 కోట్ల డాలర్లను వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కోసం అందజేస్తామని, మిగిలింది విపత్తు సమయంలో తమవంతు సేవా పాత్ర పోషిస్తున్న స్వచ్చంద సంస్థలు, ఇతర విభాగాలకు కేటాయించనున్నట్లు టిక్‌టాక్‌ ప్రెసిడెంట్‌ అలెక్స్‌ జు ప్రకటించారు. ‘విపత్తు సమయంలో ఇది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం’ అని అలెక్స్‌ జు వ్యాఖ్యానించారు. కాగా, ప్రముఖ సామాజిక మాధ్యమాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, అమెజాన్‌లు కూడా టిక్‌టాక్‌ను అనుసరించే అవకాశం ఉంది.

More Telugu News