తెలంగాణ టీడీపీ నేత కందిమళ్ల కన్నుమూత

10-04-2020 Fri 07:11
  • నిన్న ఉదయం గుండెపోటుతో మృతి
  • స్వస్థలం బోధన్‌లో అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన చంద్రబాబు, ఎల్.రమణ
TTDP leader Kandimalla died

తెలంగాణకు చెందిన టీడీపీ  సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమళ్ల రఘునాథరావు నిన్న ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్, రాజీవ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వస్థలమైన బోధన్‌‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అక్కడికి తరలించారు. రఘునాథరావు మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.