‘కరోనా’పై అవగాహన.. కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీసిన సాయికుమార్

09-04-2020 Thu 21:38
  • ఈ షార్ట్ ఫిల్మ్ లో 3 పాత్రల్లో నటించిన తండ్రీ, కొడుకు, కూతురు
  • సాయికుమార్.. పోలీస్ పాత్రలో
  • కూతురు జ్యోతిర్మయి డాక్డర్ పాత్రలో
  • హీరో ఆది పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో నటన  
Cine Artist Sai Kumar s short film
‘కరోనా’పై పోరుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి, డబ్బింగ్ అసోసియేషన్ కు ప్రముఖ నటుడు సాయికుమార్ తన వంతు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కరోనా’ పై ప్రజలకు అవగాహన కల్పించే  నిమిత్తం సాయికుమార్ ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు. తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో  కలిసి ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు.  

ఇక కొడుకు, కూతురుతో పాటు తాను కూడా కలిసి ఈ షార్ట్ ఫిలింలో సాయికుమార్ నటించారు. డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు. పోలీస్, పబ్లిక్ ఒకటైతే ‘కరోనా’ను తరిమివేయగలమని, ‘అంతిమ విజయం మనదే’ అంటూ సాయికుమార్ విశ్వాసం వ్యక్తం చేయడం ఈ షార్ట్ ఫిల్మ్ లో కనబడుతుంది.