Rajiya Begum: బిడ్డ కోసం బోధన్ నుంచి నెల్లూరుకు స్కూటీపై మహిళ... సహకరించిన పోలీసులు!

  • నెల్లూరులో ఉన్న బిడ్డ కోసం తపన
  • ప్రత్యేక అనుమతి ఇచ్చిన నిజామాబాద్ ఏసీపీ
  • రెండు రోజుల్లో 1,500 కిలోమీటర్ల ప్రయాణం
1500 Kilometer Journey of a Mother for His Son

లాక్ డౌన్ అమలవుతున్న వేళ, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని, తమ తమ ప్రాంతాలను విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని కరాఖండీగా చెబుతున్న పోలీసులు, ఓ మాతృహృదయం పడుతున్న ఆవేదనకు చలించిపోయి, తమ వంతు సహకారాన్ని అందించారు.  

వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు సాగిస్తున్న రజియా బేగం కుమారుడు నెల్లూరులో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో వైరస్ ప్రబలుతూ ఉండటంతో, తన కుమారుడిని అక్కడి నుంచి తీసుకుని రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో, బోధన్ ఏసీపీని ప్రత్యేకంగా కలిసి, అనుమతి తీసుకున్నారు.

ఆపై ఈ నెల 6వ తేదీన తన స్కూటీపై ఆమె బోధన్ నుంచి బయలుదేరి 7వ తేదీన మధ్యాహ్నానికి నెల్లూరు చేరుకున్నారు. అదే రోజు తన కుమారుడిని ఎక్కించుకున్న ఆమె, మరుసటి రోజు... అంటే, 8వ తేదీ రాత్రికి బోధన్ చేరుకున్నారు. ఇలా, 48 గంటల వ్యవధిలో ఆమె సుమారు 1,500 కిలోమీటర్లు ప్రయాణించి, తన బిడ్డను తీసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో పలువురు ఆమెను అభినందించారు.

More Telugu News