Upasana: ఉపాసన కొణిదెల పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌!

WHO Chief Thanks Upasana Konidela
  • వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ చాలెంజ్
  • స్వీకరించిన ఉపాసన కొణిదెల
  • కృతజ్ఞతలు తెలిపిన ట్రెడాస్ అధనమ్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విసిరిన 'థ్యాంక్స్ హెల్త్ హీరోస్' చాలెంజ్ ని స్వీకరించిన రామ్ చరణ్ భార్య, ఉపాసన కొణిదెల పేరును డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రాస్ అధనమ్‌ గేబ్రియేసెస్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన, "మా 'థ్యాంక్స్ హెల్త్ హీరోస్' ప్రచారంలో భాగమైనందుకు, ఇండియా నుంచి ఈ సవాలు స్వీకరించినందుకు ఉపాసన కొణిదెలకు ధన్యవాదాలు. కోవిడ్‌-19 కట్టడికై పోరాడుతూ, మనందరినీ ఆరోగ్యంగా, భద్రంగా ఉంచుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రుణపడి ఉంటా. అంతా కలిసుందాం" అని ఆయన అన్నారు.
Upasana
WHO
Chief
Twitter

More Telugu News