Corona Virus: రూ.15,000 కోట్లతో కరోనా అత్యవసర ప్యాకేజికి కేంద్రం ఆమోదం

  • రాష్ట్రాలపై కేంద్రం ఉదారత
  • మార్చి 24న రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసిన మోదీ
  • కరోనాపై తక్షణ పోరాటానికి రూ.7,774 కోట్లు
  • మిగతా నిధులు నాలుగేళ్లలో వినియోగించుకునే వెసులుబాటు
Centre approves fifteen thousand crores corona emergency package for states

కరోనా దెబ్బకు తల్లకిందులవుతున్న రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ఔదార్యం ప్రదర్శిస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా రూ.15,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా... కరోనాపై తక్షణ పోరాటానికి రూ.7,774 కోట్లు వినియోగించాలని, మిగతా నిధులను 1 నుంచి నాలుగేళ్ల వ్యవధిలో కరోనా వ్యతిరేక కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించారు. మార్చి 24న మోదీ ప్రకటించిన మేరకు ఈ ప్యాకేజీ వాస్తవరూపం దాల్చింది.

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వైద్య, ఆరోగ్యవ్యవస్థలు మరింత పరిపుష్టం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీ తీసుకువచ్చారు. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్ట్రాలు పీపీఈ సూట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర పరికరాలు కొనుగోలు చేయవచ్చని, సామాజిక నిఘా వ్యవస్థలు, ఆసుపత్రుల అభివృద్ధి, అంబులెన్స్ ల కోసం వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

More Telugu News