Chandrababu: లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి టీడీపీ విన్నపం

  • చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం
  • పేదలు, కూలీలకు ప్రత్యేక  ప్యాకేజీ ఇవ్వాలని విన్నపం
  • వైద్య సిబ్బందికి పీపీఈలను అందించాలని సూచన
Telugudesam requests center to extend lockdown

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ విన్నవించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరింది. కరెంటు, నీటి బిల్లులను రద్దు చేయాలని విన్నవించింది. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. వైద్యులు, వైద్య సిబ్బందికి పీపీఈలను అందించాలని కోరింది.

సమావేశానంతరం కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. విశాఖలోని మెడ్ టెక్ దేశానికంతా ఉపయోగపడుతోందని అన్నారు. చంద్రబాబు ముందు చూపును దేశమంతా అభినందించిందని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ. 50 లక్షలు ఇవ్వాలని కోరారు. అందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేయాలని విన్నవించారు.

More Telugu News