Ravindra kumar: పిడుగుపాటు.. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కుటుంబసభ్యులకు తప్పిన ప్రమాదం!

Devarakonda MLA Ravindra kumar camp office pent house hit by thunder storm
  • ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు
  • ఎమ్మెల్యే ఆఫీసు పెంట్ హౌస్ అంచును తాకుతూ పడ్డ పిడుగు
  • ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆయన కుటుంబ సభ్యులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్ హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
Ravindra kumar
mla
Devarakonda
camp office
Thunder-storm

More Telugu News