Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 31 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్

  • 1,266 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 363 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 17 శాతం వరకు పుంజుకున్న ఎం అండ్ ఎం
Sensex surges 1266 points

నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. భారత్ లో లాక్ డౌన్ ఫలితాలను ఇస్తుందనే భావన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,266 పాయింట్లు లాభపడి 31,160కి పెరిగింది. నిఫ్టీ 363 పాయింట్లు పుంజుకుని 9,112కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (16.74%), మారుతి సుజుకి (13.16%), టైటాన్ కంపెనీ (11.12%), హీరో మోటో కార్ప్ (9.65%), బజాజ్ ఫైనాన్స్ (9.32%).

టాప్ లూజర్స్:
 హిందుస్థాన్ యూనిలీవర్ (-3.49%), టెక్ మహీంద్రా (-2.57%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.83%), నెస్లే ఇండియా (-0.03%).

More Telugu News