Viswa shanti: టీవీ యాంకర్, సీరియల్స్ నటి విశ్వశాంతి అనుమానాస్పద మృతి

TV Anchor Viswa shanti suspicious death
  • హైదరాబాద్, ఎల్లారెడ్డిగూడలోని ఇంజనీర్స్ కాలనీలో  నివాసం
  • గత 4 రోజులుగా  ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం
  • అపార్టుమెంట్ వాసుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు 
హైదరాబాద్ లో నివసిస్తున్న టీవీ యాంకర్, సీరియల్స్ నటి విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక ఎల్లారెడ్డిగూడలోని ఇంజనీర్స్ కాలనీలో ఆమె నివాసం ఉంటోంది. గత నాలుగు రోజులుగా ఆమె తన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువాళ్లు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో, ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్నిపోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విశ్వశాంతి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. గత మూడేళ్లుగా ఆ అపార్టుమెంట్ లో విశ్వశాంతి నివసిస్తోంది. కాగా, ఆమె స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసుల సమాచారం.
Viswa shanti
TV Anchor
Serials artist
suspicious death
Hyderabad

More Telugu News